Saturday, 27 June 2015

పుష్కరాలలో ఏరోజు ఏదానము ఇవ్వాలి

పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా చాలా దూర తీరాలనుండి భక్తులు రాజమండ్రి నగరానికి  పుణ్య నదీ స్నానాలకి, పితృతర్పణలు ఇవ్వడానికి తరలి వస్తారు. వారికి తూర్పు గోదావరి జిల్లా లో ఉన్న కొన్ని పుణ్య తీర్థాలని దేవాలయాలని పరిచయం చెయ్యడానికి ఈ టపా. రోజుకొక ప్రదేశము గురించి రాద్దామని ఈ టపా ప్రారంభిస్తున్నాను. . పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా వ్రాస్తున్న టపాలో  ఈ రోజు టపాగా

పుష్కరాలలో ఏరోజు ఏదానము ఇవ్వాలి?

పుష్కర సమయములో 12రోజులు ఏరోజు ఏదానము చెయ్యవలెను అన్నది (సనాతన ధర్మము ప్రకారము) ఈ క్రింద చూపబడినది.
1వ రోజు  సువర్ణదానము, రజితదానము, ధాన్యదానముభూదానము.
2వ రోజు    వస్త్రదానము, లవణ దానము, రత్నదానము
3వ రోజు    అశ్వము, ఫలములు, బెల్లము
4వ రోజు    తేనె, పాలు, నెయ్యి, తైలము
5వ రోజు    ఢాన్యము, శకటము, వృషభములు, నాగలి
6వ రోజు    ఔషధములు, కర్పూరము, చందనము, కస్తూరి
7వ రోజు    వసతి గృహములు, వాహనము, ఆసనములు, శయ్య(పరుపు)
8వ రోజు   పుష్పమాలలు, చందనము, కందమూలములు
9వ రోజు   పిండదానము, కంబళి, కన్యాదానము
10వ రోజు  ఒపుస్తకము, కూరగాయలు, సాలగ్రామము
11వ రోజు  గజదానము

12వ రోజు  తిలాదానము(నువ్వులు) 

No comments:

Post a Comment