Friday, 19 June 2015

కోటిపల్లి

పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా చాలా దూర తీరాలనుండి భక్తులు రాజమండ్రి నగరానికి  పుణ్య నదీ స్నానాలకి, పితృతర్పణలు ఇవ్వడానికి తరలి వస్తారు. వారికి తూర్పు గోదావరి జిల్లా లో ఉన్న కొన్ని పుణ్య తీర్థాలని దేవాలయాలని పరిచయం చెయ్యడానికి ఈ టపా. రోజుకొక ప్రదేశము గురించి రాద్దామని ఈ టపా ప్రారంభిస్తున్నాను. ముందుగా కొన్ని విషయాలని ప్రస్థావిస్తాను. పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా వ్రాస్తున్న టపా

ద్రాక్షారామము నుండి 10 కి.మీ దూరములో గోదావరి నది ఒడ్డున ఉన్న క్షేత్రము. ఇక్కడ సోమేశ్వర, జనార్ధన స్వామి వార్ల ఆలయాలు ఉన్నాయి. . కాకినాడ నుండి కోటిపల్లి రైల్ కారులో ప్రయాణం..  పచ్చటి పంట పొలాలు కాలువలు పిల్ల కాలువలు కొబ్బరి తోటలు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తాయి. ఈ ప్రయాణములో బాపు గారిని తల్చుకోకుండా ఉండలేము. ప్రయాణం ఒక గంటన్నర పడుతుంది. కానీ కోటిపల్లి స్టేషన్ నుండి కోటిపల్లి రేవు దూరం ఆటో దొరికితే అదృష్టమే.....

కోటిపల్లి పూర్వ నామము సోమప్రభాపురము. ఈ క్షేత్రములో చయా సోమేశ్వరుడు, కోటేశ్వరుడు, సిద్ధి జనార్ధన స్వామి, శ్రీ శ్రీ శ్రీ రాజేశ్వరీ దేవి వారలు కొలువైన  ఉన్నారు. ఆ ప్రభావము వలన ఇచట భక్తి శ్రద్ధలతొ చేయు స్నాన, దానముల వలన భక్తులు సుకృత, దుష్కృతములకు కోటి రెట్లు ఫలితము పొందెదరు. కోటీశ్వరుని ప్రభావము వలననే ఈ క్షేత్రమునకు కోటి ఫలి , కోటి తీర్థము అని పేర్లు వచ్చాయి. కాల క్రమేణా అవి కోటిపల్లి అయింది. ఈ కోటి పల్లి కాకినాడకు 30 కి.మి దూరములో ఉన్నది. ద్రాక్షారామము, కోటిపల్లి, ముక్తేశ్వరము, అయినవిల్లి, మురమళ్ళ క్షేత్రాలని ఒక్క రోజులో దర్శించవచ్చు.(మనం సమకూర్చుకునే ప్రయాణ సాధనాన్ని బట్టి ఉంది.)  

No comments:

Post a Comment