పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా
చాలా దూర తీరాలనుండి భక్తులు రాజమండ్రి నగరానికి పుణ్య నదీ స్నానాలకి, పితృతర్పణలు ఇవ్వడానికి
తరలి వస్తారు. వారికి తూర్పు గోదావరి జిల్లా లో ఉన్న కొన్ని పుణ్య తీర్థాలని దేవాలయాలని
పరిచయం చెయ్యడానికి ఈ టపా.
రోజుకొక
ప్రదేశము గురించి టపా ప్రారంభిస్తున్నాను.
. పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా వ్రాస్తున్న టపాలో 10వ రోజు టపాగా
ముక్తేశ్వరం
కోటిపల్లి రేవుకిఅవతలై వైపున అంటే గోదవారి నదికి
అవతలి ఒడ్డున 3 కి.మీ
దూరం లో ముక్తేశ్వరం ఉంది. అమలాపురానికి 14 కి.మీ. దూరంలో గోదావరి తీరంలో ఉన్న
పుణ్య క్షేత్రం ఈ ముక్తీశ్వరం(ముక్తేశ్వరం).ఇక్కడ, ముక్తి
కాంతా సమేత క్షణ ముక్తేశ్వర స్వామి దేవాలయముఉంది.ఇక్కడి
ఈశ్వరుడు వీక్షించినంత మాత్రాన క్షణంలో ముక్తిని ప్రసాదిస్తాడని నమ్మిక.ఈ ఆలయానికి
ఎదురుగా ఒక దేవాలయం ఉంది. అది శ్రీరాజ రాజేశ్వరీ సమేత ముక్తేశ్వర స్వామి ఆలయము.





No comments:
Post a Comment