Sunday, 21 June 2015

అయినవిల్లి

పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా చాలా దూర తీరాలనుండి భక్తులు   పుణ్య నదీ స్నానాలకి, పితృతర్పణలు ఇవ్వడానికి తరలి వస్తారు. వారికి తూర్పు గోదావరి జిల్లా లో ఉన్న కొన్ని పుణ్య తీర్థాలని దేవాలయాలని పరిచయం చెయ్యడానికి ఈ టపా
అయినవిల్లి

కాకినాడకు 72 కి.మీ.(వయ యానం,అమలాపురం, ముక్తేశ్వరము) సిద్ధి వినాయక దేవాలయము చూడవలసిన దేవాలయం.ముక్తేశ్వరము నుండి 2 కి.మీ
                 ఇచ్చటి వరసిద్ధి వినాయకుడు దక్షిణాభిముఖుడుగా ఉంటాడు. దక్షప్రజాపతి తాను చెయ్యబోయే యజ్ఞానికి ముందు ఈ గణపతిని ఆరాధించాడని ఒక కధ ప్రచారములో ఉంది.. ఈ ఆలయ ప్రాకారములోనే అయ్యప్పస్వామి ఆలయము, అన్నపూర్ణాదేవి ఆలయము, విశ్వేశ్వరాలయము, కాలభైరవుని ఆలయము ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తారు. ఈ సిద్ధి వినాయకుని స్మరించి ఏకార్యము తలపెట్టినా నిర్విఘ్నముగా జరుగుతుంది అని భక్తులకు అపారమైన నమ్మిక.

No comments:

Post a Comment