Monday, 22 June 2015

మురమళ్ళ

పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా చాలా దూర తీరాలనుండి భక్తులు   పుణ్య నదీ స్నానాలకి, పితృతర్పణలు ఇవ్వడానికి తరలి వస్తారు. వారికి తూర్పు గోదావరి జిల్లా లో ఉన్న కొన్ని పుణ్య తీర్థాలని దేవాలయాలని పరిచయం చెయ్యడానికి ఈ టపా

మురమళ్ళ

శ్రీభద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి ఆలయము ఉంది. కాకినాడ నగరానికి 45 కి.మీ దూరములో ఉంది.. ప్రతిరోజూ ఈ స్వామికి కల్యాణము జరుగుతుంది. ల్యాణము జరిపించుకోదలచిన భక్తులు వారి వారి జన్మ నక్ష్త్రములననుసరించి జరిపించుకోవాలి. అందుకు గాను దేవస్థానము వారు ఆన్ లైన్ లో అన్ని వివరములు పొందుపరిచారు.  ఈ స్వామి కళ్యాణ కారకుడు. పెళ్ళి కావలసిన వాళ్ళు ఇక్కడికొచ్చి కళ్యాణము చేయించుకుంటారు వారి వారి నక్షత్రములను అనుసరించి. రోజుకి 51 మందికి మాత్రమే. అమలాపురానికి 20 కి.మీ. దూరములో ఉన్న ఈ క్షేత్రము వివరమ్య్ల కొరకు ఈ క్రింది వెబ్ సైట్ చూడగోర్తాను. http://sriveereswaraswamytemple.com/   దేవస్థానము వారు ఇంటెర్నెట్ లో పెట్టిన సైట్  చూపించిన ఫొటోఈ క్రింద విధముగా ఉంటుంది.

No comments:

Post a Comment