Tuesday, 23 June 2015

అంతర్వేది

పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా చాలా దూర తీరాలనుండి భక్తులు   పుణ్య నదీ స్నానాలకి, పితృతర్పణలు ఇవ్వడానికి తరలి వస్తారు. వారికి తూర్పు గోదావరి జిల్లా లో ఉన్న కొన్ని పుణ్య తీర్థాలని దేవాలయాలని పరిచయం చెయ్యడానికి ఈ టపా

అంతర్వేది
              ఇది సముద్ర తీరాన ఉన్న ఒక గొప్ప తీర్థ ప్రదేశము. ఇక్కడ కొలువై ఉన్న స్వామి లక్ష్మీ నృసింహస్వామి. సకల కోర్కెలను తీర్చ గలిగిన వాడు. ఇక్కడే పవిత్ర గోదావరి సముద్రముతో సంగమిస్తుంది. సూర్యోదయం సముద్రపు ఒడ్డున నిలబడి చూస్తే అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది.  బహు పురాతనమైన ఆలయము. ఎన్నో పునరుద్ధరణలు చేయబడ్డాయి. ఈ క్షేత్రము కాకినాడ నగరానికి 60 కి.మీ. దూరములో ఉన్నది. . ఇక్కడ జరిగే కల్యాణము, రధోత్సవము చూసి తీరాలి. ఉభయ గోదావరి జిల్లాలనుంచే కాక ఎక్కడెక్కడ నుంచో భక్తులు వచ్చి దర్శించి తరిస్తారు. ఈ క్షేత్రానికి వెళ్ళే దారి లోనే దిండి రెసార్ట్స్ ఉన్నాయి. చక్కటి విడిది భోజన సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ గదులను ఆన్లైన్లో రిజర్వ్ చేసుకోవచ్చు. అంతర్వేది లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రము గురించి అంతర్జాలములో సేకరించిన స్థల పురాణము ఫొటోలను ఈ క్రింద పొందుపరచడమైనది.





No comments:

Post a Comment