పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా
చాలా దూర తీరాలనుండి భక్తులు రాజమండ్రి నగరానికి పుణ్య నదీ స్నానాలకి, పితృతర్పణలు ఇవ్వడానికి
తరలి వస్తారు. వారికి తూర్పు గోదావరి జిల్లా లో ఉన్న కొన్ని పుణ్య తీర్థాలని దేవాలయాలని
పరిచయం చెయ్యడానికి ఈ టపా.
రోజుకొక
ప్రదేశము గురించి రాద్దామని ఈ టపా ప్రారంభిస్తున్నాను. . పుష్కరాల సందర్భముగా
వ్రాస్తున్న టపాలో ఈరోజు టపాగా ర్యాలి …………
రావులపాలెమునకు
6కి.మీ దూరములో ఉన్నది ఈ క్షేత్రము. ఇచ్చటి స్వామి శ్రీజగన్మోహినీకేశవస్వామి
కొలువై ఉన్నారు.
ర్యాలిక్షేత్ర నివాశాయ సాలగ్రామ
శిలాత్మనే
శ్రీ విష్ణు దివ్యరూపాయ జగన్మోహన
మంగళం
జగన్మోహిని
కేశవ స్వామి ఆలయము.. కోనసీమ ముఖ ద్వారమైన రావుల పాలెం నుండి 6 కి.మీ. ర్యాలి. ఈ ఆలయములో విశేషము స్వామివారు, అమ్మవారు ఒకే విగ్రహములో కనపడతారు. 5 అడుగుల
సాలగ్రామ శిల. దానిలో పొన్న చెట్టు, గోవర్ధనగిరి, చుట్టూ మకర తోరణము, దశావతారములు, మధ్యలో శంఖ చక్ర గద, కమలం
ధరించిన నాలుగు చేతులతో కేశవుడు. ఇదే శిలకి వెనుక వైపు జగన్మోహిని కంకణ కేయూరములతో
కాలికి అందెలతో చూడ చక్కని జగన్మోహిని రూపముతో అమ్మవారు. చూసితీరవలసిన ఆలయము.
ఇక్కడ పొందు పరచిన చిత్రాలు అంతర్జాలములో సేకరించినవి.


No comments:
Post a Comment