Tuesday, 30 June 2015
చదలవాడ తిరుపతి
ఆంధ్రదేశములో తిరుపతి పేరు విననివారు ఎవ్వరూ ఉండరు. తిరుపతి పేరు కలిగి శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న గ్రామములు ఏడు ఉన్నాయి. వాటిల్లో ప్రసిద్ధి చెందినవి పెద్ద తిరుపతి చిత్తూరు జిల్లాలోనిది, తర్వాతది పశ్చిమ గోదావరి జిల్లాలోని చిన్న తిరుపతి అదియే ద్వారకా తిరుమల. మిగిలిన తిరుపతుల గురించి పెద్దగా అందరికీ తెలియదు. అందరికీ ఏమిటి ఆ జిల్లాలో వాళ్ళకే అంతగా తెలియదు. అటువంటి గ్రామమే చదలవాడ తిరుపతి. దీనిని వాడుకలో చదలవాడ అని మాత్రమే పిలుస్తారు. ఈ గ్రామము సామర్లకోటకి 16కి.మీ దూరములో ఉంది. ఇక్కడ కొలువైన స్వామి శ్రీశౄంగార వల్లభుడు. పేరుకి తగినట్లుగానే అతి సౌకుమార్యముతో ధగధగాయమానముగా వెలిగిపోతూ ఉంటారు స్వామి. అతి పురాతనమైన కోవెల. ఇక్కడి స్వామికి ఒక ప్రత్యేకత ఉంది. స్వామికి ఒక ఇరవై అడుగుల దూరములో అంటే స్వామి ఉండే గర్భాలయానికి రెండు ద్వారముల అవతల ఒక వృత్తము గీసి ఉంటుంది. ఆ వృత్తములో నిలబడి ఎవరు స్వామిని చూస్తారో, వారికి , స్వామి వారి అం
Subscribe to:
Post Comments (Atom)



No comments:
Post a Comment