ద్రాక్షారామం
పవిత్ర
గోదావరి
నది పుష్కరాల సందర్భముగా చాలా దూర తీరాలనుండి భక్తులు రాజమండ్రి నగరానికి పుణ్య నదీ స్నానాలకి, పితృతర్పణలు ఇవ్వడానికి
తరలి వస్తారు. వారికి తూర్పు గోదావరి జిల్లా లో ఉన్న కొన్ని పుణ్య తీర్థాలని దేవాలయాలని
పరిచయం చెయ్యడానికి ఈ టపా.
రోజుకొక
ప్రదేశము గురించి రాద్దామని ఈ టపా ప్రారంభిస్తున్నాను. ముందుగా కొన్ని విషయాలని
ప్రస్థావిస్తాను. పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా వ్రాస్తున్న టపాలో 8వ రోజు టపాగా నేడు ద్రాక్షరామము
లో ఈశ్వరుడు శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వరుడు. దీనికి దక్షిణ కాశి అని కూడా
అంటారు. చాలా పెద్ద ఆలయ ప్రాంగణము. పంచారామాలలొ ఈ ఆలయము కూడా ఒకటి. ఈ పుణ్యక్షేత్రం కాకినాడకు 28 కి.మీ., రాజమండ్రికి
50 కి.మీ., అమలాపురానికి
25 కి.మీ. దూరంలోనూ ఉంది.ఆలయానికి తూర్పు వైపున ఉన్న
పుష్కరిణిలో గోడావరి నది ఏడుపాయలు కలిసి
ఉంటాయని దీనిని సప్త గోదావరి అంటారు.
No comments:
Post a Comment