Friday, 19 June 2015

లోవ

పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా తూర్పు గోదావరి జిల్లాలలోని వివిధ ఆలయాలని ముఖ్య ప్రదేశాలని పరిచయం చేద్దామని ఈ టపా.
అన్నవరానికి 25 కి.మీ దూరములో, తుని పట్టణానికి 10 కి.మీ దూరములో, జాతీయ రహదారికి (విశాఖ-రాజమండ్రి) 2 కి.మీ ల దూరములో పచ్చటి ప్రకృతి సౌందర్యముతొ అలరారుతుంది ఈ క్షేత్రము. ఇక్కడి అమ్మవారిని తలుపులమ్మ అని పిలుస్తారు. తలచినంత మాత్రాన మన తలపులను గ్రహించి కోర్కెలను తీర్చే తల్లి గనుక ఆవిడ తలుపులమ్మ అయింది. రెండు కొండలమధ్యన ఒక పర్వత సానువులపై వెలసిన అమ్మవారు. లోయ కాలగతి లో లోవగా మారింది. ఈ ఆలయానికి మెట్ల దారి గుండా లేదా కొండ పైకి ఉన్న రహదారి మార్గముగుండా చేరుకుని  చల్లని తల్లిని దర్శించుకోవచ్చు. నిత్యమూ రద్దీగా ఉంటుంది ఈ క్షేత్రము.

No comments:

Post a Comment