Wednesday, 1 July 2015

నవజనార్ధన ఆలయాలు

     పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా చాలా దూర తీరాలనుండి భక్తులు రాజమండ్రి నగరానికి  పుణ్య నదీ స్నానాలకి, పితృతర్పణలు ఇవ్వడానికి తరలి వస్తారు. వారికి తూర్పు గోదావరి జిల్లా లో ఉన్న కొన్ని పుణ్య తీర్థాలని దేవాలయాలని పరిచయం చెయ్యడానికి ఈ టపా. రోజుకొక ప్రదేశము గురించి రాద్దామని ఈ టపా ప్రారంభిస్తున్నాను. . పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా వ్రాస్తున్న టపాలో  ఈ రోజు టపాగా                                         
                                                               నవజనార్ధన ఆలయాలు     

                పంచారామములని పవిత్ర మాసమైన కార్తీకములో ఒకే రోజున భక్తులు దర్శిస్తారు. ఆ పంచారామములలో నాలుగు గోదావరీ తీరములోనే ఉన్నాయి. అవి సామర్లకోట కుమారరామ క్షేత్రము, ద్రాక్షారామములోని భేమేశ్వరుడు, పాలకొల్లు లోని క్షీరా రామలింగేశ్వరుడు, భీమవరం లోని భీమారామము. ఇంక మిగిలిన ఐదవది గుంటూరుజిల్లాలోని అమరావతి. ఈ ఐదిటిని ఒకేరోజు దర్శనం చెయ్యగలిగితే జన్మ ధన్యత పొందింది అని భక్తులు విశ్వసిస్తారు.
                      అలాగే తూర్పు గోదావరి జిల్లాలోని నవజనార్దనుల దర్శనం కూడా.. ఈ తొమ్మిది జనార్దన స్వాముల ఆలయాలు నారద మహర్షి ప్రతిష్టించాడని ప్రతీతి. శ్రీమహావిష్ణు దర్శనం సకల శుభదాయకము గనుక ఈ తొమ్మిది జనార్దన ఆలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాము.
1.ధవళేశ్వరము: రాజమండ్రిలో కలిసి పోయిన ఈ గ్రామము 5 కి.మీ దూరములో ఉంది. ఇచ్చటి స్వామివారు యోగ ముద్ర పట్టి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు.
2. మడికి: ఈ గ్రామము కూడా రాజమండ్రికి అతి చేరువలో ఉంది. దాదాపు 18 కి,మీ ఉంటుంది. ఇచ్చట స్వామి సుదర్శనధారియై భక్తులను అనుగ్రహిస్తారు.
3. జొన్నాడ: రాజమండ్రి నగరానికి 20 కి.మీ దూరములో ఉన్నది ఈ గ్రామము. ఇచ్చట ఉన్న జనార్దనుడు భయమెందుకు నేను ఉన్నాను కదా అన్నట్లుగా అభయ ముద్రతో భక్తులకు దర్శనమిస్తారు.
4. ఆలమూరు: కోనసీమ ముఖద్వారమైన రావులపాలెమునకు 10 కి.మీ ల లోపు ఉన్న గ్రామము. ఇచ్చటి జనార్దనుడు కూడా అభయముద్రతో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు.
5. తాటిపూడి/మండపేట: గోదావరి వరదలకి ఈ ఆలయము  తాటి(త)పూడిలో శిధిలముకాగా దీనిని మండపేటలో పునర్మించారు. రాజమండ్రి నగరానికి 30 కి.మీ దురములో ఉన్నది ఈ పట్టణము.
6. కపిలేశ్వరపురము: మండపేట పట్టణానికి 15 కి.మీ దూరములో ఉన్నది ఈ గ్రామము. 
7. మాచర: మండపేట పట్టణానికి 18 కి.మీ ల లోపు ఉన్నది ఈ గ్రామము. ఇచ్చటి జనార్దనుడు జ్వాలాముద్రతో దర్శనమిస్తారు.
8. కోరుమిల్లి: మండపేట పట్టణానికి 25 ఖి.మీ.ల దూరములో ఉన్నది. దీనిని పెద కోరుమిల్లి అని పిలుస్తారు.
9. కోటిపల్లి: కాకినాడ నగరానికి 30 కి.మీ.ల దూరములో ఉన్నది ఈ గ్రామము. నవ జనార్దన ఆలయాలలో ఆఖరి ఆలయము. భక్తుల కోరికలను సిద్ధింప చేసే జనార్దనుడు. కనుక సిద్ధి జనార్దనుడు అని పిలుస్తారు.
ఈ సమాచారము మరియు చిత్రాలను అంతర్జాలము నుండి సేకరింపబడినవి. గమనించగలరు.   

  

No comments:

Post a Comment