పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా వ్రాస్తున్న టపాలో ఈ రోజు టపాగా ద్వారపూడి.
తూర్పు
గోదావరి జిల్లా మండపేట మండలంలోని ద్వారపూడి అనే గ్రామం లో ఈ అయ్యాప్ప క్షేత్రం
అలరారుతోంది.
అయ్యప్ప హిందూ
దేవతలలో
ఒకరు. ఈయనను
హరిహరసుతుడని,
మణికంఠుడని
కూడా
పిలుస్తారు. అయ్యప్ప
పూజా
సాంప్రదాయం
అధికంగా
దక్షిణ
భారతదేశంలో
ఉంది. అయ్య(= విష్ణువు), అప్ప(=శివుడు) అని
పేర్ల
సంగమం
తో అయ్యప్ప
నామం
పుట్టింది. మహిషి
అనే
రాక్షసి
ని చంపి
అయ్యప్ప
కేరళ
లోని
శబరిమలైలో
వెలిశాడు. శబరిమలై
అంటే
శబరి
యొక్క
పర్వతము
అని
అర్థం . ఈ దేవాలయమనునకు
మాలధారణ
చేసుకోని
నలభైఒక్క
రోజులు
నియమాలు
పాటిస్తారు. ఈ అయ్యప్ప
మాలధారణ
దీక్ష
ఒక్క
కేరళ
లోనే
కాకుండా
మన ఆంధ్రప్రదేశ్
లో అనేక
పట్టణాలలో
నిర్మించారు. అందులో ఒకటి గా ప్రసిద్ధి గాంచినది ద్వారపూడి, ఈ క్షేత్రము ఆంధ్రా శబరిమలై గా పిలవబడుతుంది.
1989వ సంవత్సరంలో కంచికామకోటి పీఠాదిపతి శ్రీ జయేంద్ర సరస్వతి పంచలోహ అయ్యప్ప విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. ఎన్.
ఎల్. కనకరాజు
గురుస్వామి
నంకల్ప
బలంతో
శ్రీకారం
చుట్టిన
ఈ ఆలయం
అనతి
కాలం
లోనే
దినదిన
ప్రవర్థమానమై
ప్రముఖ
యాత్రాస్థలంగా
ఖ్యాతి
గాంచింది
ఆలయం ముందు భాగం లో ఏకశిలతో చెక్కిన 18మెట్లను అమర్చారు. ముఖద్వారం లో శివకేశవుని, పశ్చిమ దిశలో పంఛముఖి ఆంజనేయ స్వామి అతి పెద్ద విగ్రహాలు విశేషంగా ఆకర్షిస్తాయి. ఆలయ క్రింది భాగం లో దుర్గాదేవి ఆలయం, సింహద్వారం, శేషపాన్పుపై పవళించిన విష్ణుమూర్తి, షిరిడీ సాయినాధ్ మందిరం, నవగ్రహాలు ఉప ఆలయాలు గా నిర్మించారు. అయ్యప్ప ఆలయానికి
తూర్పు
వైపున 200 అడుగుల
పొడవున
సొరంగం
తవ్వి, 40 అడుగుల
లోతులో
నిర్మించిన
ద్వాదశ
జ్యోతిర్లింగాలయం ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుంది. పాలరాతితో మూడు అంతస్తులుగా నిర్మించిన ఆష్టాదశ ఉమాలింగేశ్వర స్వామి ఆలయం లో ఋషికేశ్, హరిద్వార్, కేదార్ నాధ్, బ్రహ్మకపాలం, గంగోత్రి, అమర్ నాధ్, కాశి, యమునోత్రి, ఓంకార్ తదితర ప్రాంతాల నుండి తెచ్చిన 18 శివలింగాలను ప్రతిష్ఠించారు. ఆలయం వెలుపల నటశేఖరుని, నందీశ్వరుని అతిపెద్ద ప్రతిమలు భక్తులను ఆకట్టుకుంటాయి
అయ్యప్ప దీక్ష
చేపట్టి
కేరళ
లోని శబరిమల వెళ్ళలేని భక్తులు ఇక్కడ ఉన్న అయ్యప్ప ఆలయాన్ని సందర్శించి ఇరుముడులు సమర్పిస్తారు. జనవరి మాసంలో వచ్చే మకర సంక్రాంతి పర్వదినాన మకర జ్యోతి దర్శన భాగ్యం శబరిమల లో వలె ఈ క్షేత్రం లో కూడా భక్తులకు కలుగుతుంది.
No comments:
Post a Comment