పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా చాలా దూర
తీరాలనుండి భక్తులు రాజమండ్రి నగరానికి పుణ్య నదీ స్నానాలకి, పితృతర్పణలు ఇవ్వడానికి
తరలి వస్తారు. వారికి తూర్పు గోదావరి జిల్లా లో ఉన్న కొన్ని పుణ్య తీర్థాలని దేవాలయాలని
పరిచయం చెయ్యడానికి ఈ టపా. రోజుకొక ప్రదేశము గురించి రాద్దామని ఈ టపా
ప్రారంభిస్తున్నాను.
పవిత్ర గోదావరి
నది పుష్కరాల సందర్భముగా వ్రాస్తున్న టపాలో ఈరోజు టపాగా
బిక్కవోలు
సామర్లకోటకి 15 కి.మీ. దూరములో
బిక్కవోలు ఉంది. ఈశ్వరుని కుటుంబము కొలువు తీరిన గ్రామము.
గోలింగేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు,
రాజేశ్వరుడు, భారీ లక్ష్మీగణపతి ఆలయము ఈ గ్రామము లో ఉన్నాయి. ఈ గణపతి మన కోర్కెలను ఇట్టే తీర్చేస్తాడు. స్వామికి
గరికతో పూజ చేసి స్వామి విగ్రహం దగ్గిరకి వెళ్ళి ఆయన ఎడమ చెవిలో మన కోరిక
చెప్పాలి. కోరిక తీరిన తరువాత వచ్చి మళ్ళీ
దర్శనం చేసుకోవాలి.ఈ గనపతి విగ్రహం రోజు రోజు కి పెరుగు తోంది అందుకే
ఇదివరలో చేయించిన కవచము సరిపోవడం లేదు అని అర్చకులు చెబుతున్నారు. (9948754824 ఇది ఒక
అర్చకుల ఫోన్ నంబరు వివరములకు వీరిని సంప్రదించండి.) శివాలయాలు
ప్రసిద్ధిగాంచిన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయము ఉన్నాయి. అన్నీ అతి పురాతనమైనవి. చూడ
తగినవి.

No comments:
Post a Comment