21/08/2016 తేదీన జరిగిన బ్రహమశ్రీ చాగంటి వారి ప్రసంగములో భీష్ముడు ధర్మజునితో రాజా సంకల్పముల వలన కామము(కోర్కెలు) కలుగుతాయి. మనస్సు సంకల్ప వికల్ప సంఘాతము. ధర్మ బద్ధమా అధర్మమా, ఇది మంచిదా చెడుదా అని చూడకుండా ప్రతిపాదిస్తూ ఉంటుంది. మనిషి వీటిలో దేనిమీద అయినా అనురక్తుడయ్యడనుకోండి, మనస్సు ఈ శరీరాన్ని పట్టుకుని తన కోరిక తీర్చుకుంటుంది. మనిషిని అఢః పాతాళానికి తోశేస్తుంది. అందుకని మనసుపై అజమాయిషీ కలిగి ఉండు. అది సాధన వలన మాత్రమే కలుగుతుంది. మనసు ప్రీతితో కానీ అప్రీతితో కాని మాట వింటుంది. ఒక రోజు ఒక మంచి పని చేద్దామని అనిపిఉంచగానే మనసు ముందు ఆ పనిలో ఉన్న కష్టాలని చెబుతుంది. దాని మాట వినకుండా మీరు మీ ప్రతిపాదనకే మొగ్గు చూపారనుకోండి అది యేమీ అనదు. మరునాడు అంటే.. అలా నాలుగు రోజులు మంచి పని వైపు మీరు జరిగితే అయిదవనాడు మనస్సే ఇంకా బయలుదేరలేఅదేమిటి. ఆ మంచి పని చెయ్యాలి అని చెబుతుంది. ఇది సాధనతో మాత్రమే వీలవుతుంది. అని మనస్సు నియంత్రించుకోవడం ఎలా అన్న విషయం మీద ఎన్నో ఉదాహరణలతో చక్కగా వివరించారు.
మనిషికి కోపము ఎందుకు వస్తుంది. దానికి రెండే రెండు కారణాలున్నాయి. ఒకటి తన కోరిక తీరకపోతే కారణం వెతికి కోరిక తీరకపోవడానికి కారణమైన దాని మీద కోపము పెంచుకుంటుంది. రెండవది ఇతరులు యేది తప్పు చేశారు అన్న భావన. మనసు క్రోధానికి వశపడ కుండా ఉండాలంటే మనిషి ఓర్పు అలవరచుకోవాలి అది ఎలా సాధించాలి అన్నది భీష్ముడు చెప్పగా వ్యాసుడు వ్రాయగా తిక్కన తెనిగించగా పూజ్వ గురువులు నాలాంటి వారికి అర్ధమయ్యే రీతిలో చక్కగా చెప్పారు. తదుపరి భీష్ముడు ధర్మజునితొ చెప్పిన్ నాడీ ఝంభుని వృత్తాంతము, హంసగీతి కూడా చెప్పారు. ఇది విన్నంత సేపూ ఆహా ఓహో అని పిస్తుంది అర్ధమైన దానిలా కనపడుతుంది. తీరా ప్రసంగం అయిపోయి ఇంటికి బయలుదేరగానే ఈ రోజు ఏమి చెప్పారు అని ఆలోచిస్తే....... ఏదీ జ్ఞాపకం రాదు.

No comments:
Post a Comment