ఏ పండుగ అయినా సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. కానీ అమ్మవారి పండుగ సంవత్సరానికి రెండుమార్లు వస్తుంది. ఎలాగ అంటే, ----చైత్రమాసంలో ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వసంతనవరాత్రులు ఒకసారి...... ఆశ్వీయుజ మాసంలో పాడ్యమి నుండి విజయదశమి వరకు శరన్నవరాత్రులు మరొకసారి ..... జరుగుతాయి.
మాసాల్లో మొదటిది చైత్రమాసం, నక్షత్రాలలో మొదటిది అశ్విని. చైత్రమాసంలో నవరాత్రులను వసంతనవరాత్రులు అని, నక్షత్రాలలో మొదటిది అయిన అశ్విని ప్రధానంగా ఉండే ఆశ్వీయుజమాసంలో నవరాత్రులను శరన్నవరాత్రులు అని, రెండుమార్లు నవరాత్రులను జరుపుకుంటాము. ఒకటి ఉత్తరాయణంలో ...... మరొకటి దక్షిణాయనంలో రావటం మరొక విశేషం.
మరో విశేషం కూడా ఉంది. చైత్రమాసపు నవరాత్రులు అశ్వినీ నక్షత్రంతో ప్రారంభమైతే, అశ్వినీ నక్షత్రం పూర్ణిమ నాడు ఉండే ఆశ్వీయుజమాసపు నవరాత్రులు చిత్తా నక్షత్రంతో ప్రారంభమవుతుంది. మరొక విశేషం ఏమిటంటే ...... నక్షత్రాలు 27 లో మొదటిది అశ్విని అయితే సరిగ్గా మధ్యగా వుండే నక్షత్రం చిత్త. అలాగే మాసాల్లో 12 లో మధ్యగా వుండే మాసం ఆశ్వీయుజం. ఆరింటిలో మొదటిది చైత్రమాసం అయితే..... మధ్యగా ఉండే మాసం ఆశ్వీయుజం...... అదే విధంగా ఋతువులలో మొదటిది వసంతమైతే ... మధ్యది శరదృతువు.
ఇది అంతా ఎందుకు అంటే... అమ్మవారు ఆదిలోనూ, మధ్యలోనూ కూడా పూజింపబడే విధంగా ఏర్పాటుచేసుకొని మనల్ని అనుగ్రహించాలి అనే కరుణాబుద్ధి కలిగి ఉంది అని తెలియచేయటానికే. తిథులు 30 లో కూడా పూర్ణిమ వరకు పూజింపబడేది అమ్మ (ఆదిశక్తి) యే. (ప్రతిన్ముఖ రాకాంత తిథి మండల పూజితా).
ఇలా ఆయన -- ఋతువు -- మాస --- పక్ష --- తిథులలో రెండుమార్లు పూజింపబడుతూ తొమ్మిదిరోజులపాటు మరి ఏ ఇతర దైవానికీ పూజలు జరగనేజరుగవు.
యోగం అనేది మొత్తం కుండలినీశక్తికి సంబంధించి ఉంటుంది. "కుండలినీ" అనే శబ్దం సంస్కృతంలో స్త్రీలింగం. కాబట్టి ఈ కుండలినీ శక్తినీ సాధించదలచి యోగాన్ని ప్రారంభించిన వ్యక్తికి కలిగే అనుభవాలన్నిటినీ క్రమంగా ఒక స్త్రీలో కలిగే మార్పులుగా వర్ణించి చెప్పారు మన (పూర్వీకులు) పెద్దలు.
ఆ కారణంగా అమ్మవారి తొమ్మిది అవతారాల్లో సాధకునికి క్రమక్రమంగా జరిగే అభివృద్ధి తొమ్మిదిదశల్లో ఉంటుందని ప్రాచీనులు చెప్పినట్టు తెలుస్తుంది. ఈ తొమ్మిది దశలు దాటిన సాధకుడు "దశ" అవస్థనాటికి విజయాన్ని సాధించి సిద్ధినిపొంది సిద్ధుడౌతాడు. ఆ సిద్ధినే "విజయ(దశమి)సిద్ధి" అంటారు.
నవరాత్రులలో ప్రతిరోజూ దేవికి వేసిన ఒక్కొక్క అవతారాన్ని(ఒక్కొక్క అలంకారాన్ని) సాధన చేసే సాధకుని ఒక్కొక్క మెట్టు అభివృద్ధుగా గమనించాలని మనం భావించాలి. ప్రతిరోజూ అమ్మవారి అలంకారాన్ని చూసి రావాలనే నియమాన్ని విధించింది కూడా ఇందుకే..... సాధకుని ప్రతీ దశలోనూ అభివృద్ధిని గమనిస్తూ ఉండాలనే రహస్యాన్ని అర్థమయ్యేలా చెప్పటానికే ఇవన్నీను.
Curtesy: Mani, vizag
నవరాత్రులలో ప్రతిరోజూ దేవికి వేసిన ఒక్కొక్క అవతారాన్ని(ఒక్కొక్క అలంకారాన్ని) సాధన చేసే సాధకుని ఒక్కొక్క మెట్టు అభివృద్ధుగా గమనించాలని మనం భావించాలి. ప్రతిరోజూ అమ్మవారి అలంకారాన్ని చూసి రావాలనే నియమాన్ని విధించింది కూడా ఇందుకే..... సాధకుని ప్రతీ దశలోనూ అభివృద్ధిని గమనిస్తూ ఉండాలనే రహస్యాన్ని అర్థమయ్యేలా చెప్పటానికే ఇవన్నీను.
No comments:
Post a Comment