1945-55 దశకంలో పుట్టిన వీరులము మేము!*. *నిజంగా* *నిజం* . *జీవితం* **నేర్చుకోండి** .
1945-55 దశకం లో పుట్టిన మేము ఒక ప్రత్యేక తరానికి చెందిన వాళ్ళం. చాలా సాధారణ స్థాయి బళ్ళో చదువుకున్నా, దాదాపు మా తరం వాళ్ళు అన్ని విషయాలలో నిష్ణాతులుగా కనిపిస్తారు.
ఇంగ్లీష్ మీడియం లో చదువుకోకున్నా, వీరికి ఆ భాష మీద ఉండే పట్టు అమోఘం. English కాదు వీరు చదువుకొన్న ప్రతి విషయం లో ఎంతో ప్రతిభ చూపించేవారు. లెక్కలు, సైన్సు, సాంఘిక శాస్త్రం ఇంకా అనేక విషయాలు ఎంతో శ్రద్ధతో నేర్చుకునేవారు.
పోటీ చాలా ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో అదేమంత గొప్ప విషయంగా కనపడకపోవచ్చు, కానీ ఆనాడు ఉన్న socio-economic పరిస్థితులకు వీరు సాధించింది చాలా ఎక్కువ అనే చెప్పుకోవాలి.
దాదాపు ప్రతీ కుటుంబం లో కనీసం నల్గురు నుండి ఆరుగురు పిల్లలు ఉండేవాళ్ళు. ఇంత పెద్ద కుటుంబం కేవలం తండ్రి సంపాదన పైనే ఆధార పడేది... అంటే అందరికీ కడుపునిండా తిండి దొరకటమే కష్టం అయ్యేది.
పొద్దున్నే చద్దన్నం, మధ్యాహ్నం మామూలు భోజనం ఉండేది. రాత్రికి కూడా అంతే. పండగ రోజుల్లో మాత్రం కాస్త స్పెషల్ గా ఉండేది. బొగ్గుల కుంపటిలోనో, కట్టెల పొయ్యిలోనో వంటలు చేసి, ఇంత మంది పిల్లలను పెంచిన ఆ నాటి తల్లుల ఋణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేము.
దాదాపు అందరం దుంపల బడిలోనో ప్రభుత్వ ఉచిత పాఠశాలలోనో చదువుకొన్న వాళ్ళమే. మాలో చాలా మంది డిగ్రీ చదువులకు వెళ్లేవరకూ చెప్పులు లేకుండా నడిచిన వాళ్ళమే!
ఆ రోజుల్లో ప్రతీ వాళ్ళు టైపు చేయటం, షార్ట్ హ్యాండ్ నేర్చువుకోవటం చాలా కామన్గా ఉండేది. స్కూలు ఫైనల్ అయిన వెంటనే ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం తల్లి-దండ్రులు తమ బిడ్డలకొక ఉద్యోగం వస్తే చాలు అనుకునేవాళ్ళు.
నిజంగానే ఆ రోజులల్లో ఇంత పోటీ ఉండేది కాదు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సులువుగానే దొరికేవి. డిగ్రీ చేసి PG చేసిన వాళ్ళు తక్కువే.
మా తరం వాళ్లకి సినిమా, రేడియో తప్ప వేరే వినోదం ఉండేది కాదు. మూడు అణాలు ఇచ్చి తెరకు దగ్గరగా కూర్చొని చూసిన సినిమాలు ఎన్నో. అదీ కాకుండా, రేడియోలో పాత కొత్త పాటలు వినటం ఎంతో ఇష్టం గా ఉండేది. హిందీ పాటల విషయానికొస్తే, పాటల ట్యూన్ ని బట్టి సంగీత దర్శకులెవరో చెప్పే వాళ్ళం. SD బర్మన్, నౌషాద్, మదన్ మోహన్, శంకర్ జైకిషన్, లక్ష్మీ కాంత్ ప్యారేలాల్, కళ్యాణ్ జీ ఆనంద్ జీ... ఒకరేమిటి, ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు. ఈ సంగీత సామ్రాట్టులు అందించిన పాటలు ఈనాటికీ శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి.
మాకు ఉన్న మరో వినోదం క్రికెట్. దాదాపు ఊహ తెలిసినప్పటి నుంచి క్రికెట్ ఆట ఆడేవాళ్ళం. రేడియోలో కామెంటరీ క్రమం తప్పకుండా వినేవాళ్ళం. ఈ నాడు గొప్ప క్రికెటర్లుగా పరిగణించ బడుతున్నా, ఆ రోజుల్లో ఆడటం మొదలు పెట్టిన వారే. గుండప్ప విశ్వనాధ్, సునీల్ గవాస్కర్, అజిత్ వాడేకర్, పటౌడీ, జయసింహ, ఏరాపల్లి ప్రసన్న, బేడీ, చంద్రశేఖర్... లగాయతు ఈ నాడు క్రికెట్ ఆడుతున్న ప్రతీ ఒక్కరినీ ఫాలో ఔతున్నాము.
ఈ నాటికీ దాదాపు అందరం 65-70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నవాళ్ళమే. జీవితం లో ఉన్నత ఉద్యోగాలు చేసుకున్నవాళ్ళమే. పిల్లలను పై చదువులు చదివించి ప్రయోజకుల్ని చేసినవాళ్ళమే!
అయినా ఉత్సాహం ఏమాత్రం తగ్గక ఇంకా యువకుల్లా కనిపిస్తున్నవాళ్ళమే. ఈ వయసులో కూడా మన చిన్నప్పటి స్నేహితులను పేరు పేరునా గుర్తుంచుకొని కూస్తున్న వాళ్ళమే.
ఇక మాకన్నా అదృష్టవంతు లెవరుంటారు?
ఆహా! జ్ఞాపకాల దొంతర అంటే ఇదీ!! అచ్చంగా మన బాల్యాన్నిమనమే రాసుకున్నట్టు వుంది!!!
As received from a friend in whatsapp